Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి
నవతెలంగాణ -మునుగోడు
మూడేండ్ల కాలం నుండి రాజగోపాల్ రెడ్డి నియోజవర్గ అభివృద్ధి కోసం కాకుండా రాష్ట్రంలోని కాంట్రాక్టులు తమకు అప్పజెప్పితే టీిఆర్ఎస్లో చేరుతానని కేసీఆర్ ఇంటి చుట్టూ 300 సార్లు తిరిగిన విషయాన్ని మరిచి బీజేపీ రూ. 21 వేల కోట్లకు అమ్ముడుపోయినది వాస్తవం కాదా అని రైతు బంధు సమితి అధ్యక్షుడు , ఎమ్మెల్సీ డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కోతులారం గ్రామంలో టీిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందిన 12 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి టీిఆర్ఎస్ లో చేరితే దొంగలు వేదాలు పలికిన విధంగా రాజగోపాల్ రెడ్డి దొంగనే దొంగ అన్నట్లు బీజేపీికి అమ్ముడుపోయి నియోజవర్గ అభివృద్ధి కోసం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజావ్యతిరేక విధానాలను బట్టబయలు చేసేందుకు ఈనెల 20న మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రజా దీవన సభలో కేసీిఆర్ కేంద్ర ప్రభుత్వ బీజేపీ వైఖరిని ప్రజలకు వివరించ నున్నారని తెలిపారు. నియోజవర్గం ఏర్పడి గత 65 ఎండల్లో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మునుగోడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2014 నుండి 18 వరకు జరిగిన అభివృద్ధి మాత్రమే నియోజవర్గ ప్రజల కండ్ల ముందు కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కోతులారం సర్పంచ్ జాజుల పారిజాత ,ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య,మాజీ సర్పంచ్ జక్కల లోకేష్ ,జాజుల నర్సింహ , బంగారు రవి ,కందుల నర్సింహ, కందుల రాజు ,గుండు చెన్నకృష్ణయ్య కందుల లింగస్వామి ,అనిల్ ,నర్సింహ,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.