Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-చౌటుప్పల్
మతోన్మాద బీజేపీని మునుగోడులో చిత్తుగా ఓడించాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మంగళవారం మున్సిపాలిటీలోని లింగోజిగూడెంలోని 2వ వార్డులో ఆయన సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల మద్ధతు టీఆర్ఎస్కే ఉందన్నారు. మునుగోడులో ఫ్లోరైడ్‌ను పారదోలిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కులవృత్తులు, చేతివృత్తులకు పూర్వ వైభవం తీసుకువస్తున్నారన్నారు. కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. మునుగోడు ఎన్నిక ప్రజల అవసరం కోసం వచ్చింది కాదని, రాజగోపాల్‌రెడ్డి స్వలాభం కోసం వచ్చిందని ఆరోపించారు. తెలంగాణ శక్తిని ఎవరూ ఆపలేరన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణలో టీఆర్ఎస్ పది కాలాలపాటు ఉంటుందన్నారు. తెలంగాణలోని ప్రతి కుటుంబానికి కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ పాలిస్తున్న పది రాష్ట్రాల్లో కల్లును నిషేదించిందని విమర్శించారు. పేదలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మాట తప్పని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌కు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందన్నారు. కారు గుర్తుకు ఓట్లు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల రాజ్యలక్ష్మీస్వామిగౌడ్, వార్డుల అధ్యక్షులు బొంగు నాగేశ్‌గౌడ్, వల్లందాసు సతీశ్‌గౌడ్, సీపీఐ(ఎం) నాయకులు బాతరాజు దశరథ, ఎర్ర ఊషయ్య, పర్నె ధర్మారెడ్డి పాల్గొన్నారు.