Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ- మర్రిగూడ
మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎందుకు చేశారని ఎవరికోసం చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ,కమ్మగూడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడారు. గత మూడున్నర సంవత్సరాలలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అదే ప్రతిపక్ష హౌదాలో రాష్ట్రానికి ఏం చేస్తాడో ప్రజలే ఆలోచించాలని అన్నారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి పల్లెలు పచ్చగా ఉండేందుకు పల్లె ప్రకతి వనాలు, రైతుల సంక్షేమం కోసం రైతు వేదికలు ఏర్పాటుచేసి ఆకుపచ్చ తెలంగాణగా ఏర్పాటు చేస్తున్న ఘనత కేసీఆర్ ది అని రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టీిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మర్రిగూడ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, భీమనపల్లి ఎంపిటిసి చిలువేరి విష్ణు, గ్రామ శాఖ అధ్యక్షులు నడిమింటి శీను, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.