Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు రూరల్
వ్యవసాయ కార్మికులకు వైద్యం ఉపాధి, కరువు సమగ్ర శాసనం చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆలేరు మండలం శర్బనాపురం గ్రామంలో ఉపాధి కూలీల రోడ్డుకు ఇరువైపుల చెట్లు సాబు చేస్తున్న క్రమంలో వారు మాట్లాడుతూ సమాజానికి ఆహారాన్ని అందిస్తూ నిత్యం అష్ట కష్టాలు పడుతున్న వ్యవసాయ కార్మికులకు గోడును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. వ్యవసాయ రంగంపై ఆధారపడి వ్యవసాయ కూలీలు దేశంలో 60శాతం మంది ఉన్నారన్నారు. కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు కూలి బంధు పథకం ప్రవేశపెట్టాలని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గడ్డమీది నరేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బొమ్మకండి లక్ష్మీనారాయణ, సిపిఎం మండల కార్యవర్గ సభ్యులు సుధ గాని సత్త రాజయ్య ,పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి, కూలీలు మంగమ్మ ,లక్ష్మి, మణెమ్మ, మంగ ,రేణుక ,లక్ష్మి ,విజయ తదితరులు పాల్గొన్నారు.