Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి డీవైఎఫ్ఐ సంపూర్ణ మద్ధతు ఉంటుందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం పట్టణకేంద్రంలోని రంగారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం మునుగోడు నియోజకవర్గ విస్తతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి అకౌంట్లలో 15 లక్షలు జమ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని విమర్శించారు. ఐక్యంగా ఉన్న యువకుల మధ్య కులం, మతం పేరుతో చిచ్చుపెట్టి ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. యువత అభిరుచుల మీద ఆంక్షలు విధిస్తూ యువకులను మోసం చేస్తుందని పేర్కొన్నారు. యువకుల మెదళ్లలో మతోన్మాదాన్ని ఎక్కించాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని యువతను కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల కార్యదర్శులు మల్లం మహేశ్, గడ్డం వెంకటేశ్, జిల్లా సహాయకార్యదర్శులు కవిడె సురేశ్, ఎమ్‌డి.ఖయ్యుమ్, మిర్యాల భరత్, వంశీ, నరేశ్, నాగరాజురెడ్డి, శ్రీకాంత్, లింగస్వామి, పురుషోత్తం పాల్గొన్నారు.