Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వివక్షతోనే అంబేద్కర్ ఫొటో కరెన్సీ నోట్లపై ముద్రించడం లేదని భువనగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఉపాధ్యక్షులు కేతావత్ మహేందర్ నాయక్ ఆరోపించారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాల (96వ వారం) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తనా ఇప్పటివరకు భారత కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించక పోవడం విచారకరమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్ జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, కంచనపల్లి నర్సింగ్ రావు, టీ ఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మిర్యాల శ్రీనివాస్, సాధన సమితి జిల్లా నాయకులు భానోతు భాస్కర్ నాయక్ రావుల రాజు, బండారు శివ శంకర్, దండు నరేష్, ధరణికోట నర్సింహ, ఇంజ పద్మ పాల్గొన్నారు.