Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి.అబ్బాస్
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశంలో కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న మతోన్మాద బీజేపీని మునుగోడులో ఓడించాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్‌డి.అబ్బాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలో ఆవాజ్ కమిటీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించి ఓట్లు దండుకునేందకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాయాలని ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు మత సామరస్యం, లౌకికవాదం, శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ అనేక కుట్రలకు పూనుకుంటుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం గల భారతీయ సమాజం ప్రమాదకర స్థితిలోకి నెట్టబడుతుందని, దీనిని అన్ని వర్గాల ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ప్రమాదకర బీజేపీని మునుగోడులో ఓడించాలన్నారు. కారు గుర్తుకు ఓట్లువేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్కె.లతీఫ్, ప్రధానకార్యదర్శి మీర్ ఖాజా అలీ, ఉపాధ్యక్షులు మహ్మద్‌పాషా, ఎమ్‌డి.ఖయ్యుమ్, ఎమ్‌డి.ఖాసీమ్, జానీ, షబ్బీర్ పాల్గొన్నారు.