Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరు టౌన్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ హయాత్నగర్లో ఉమ్మడి నల్లగొండ , రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (మదర్ డెయిరీ) చైర్మెన్ లింగాల శ్రీకర్ రెడ్డి అధ్యక్షతన పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార సంఘం చైర్మెన్ పాల ఉత్పత్తిదారులు సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని పాల ఉత్పత్తిదారులు పాల రైతులను ప్రోత్సహించడానికి నాలుగు రూపాయల ఒక లీటర్ పైన ఇన్సెంటివ్ ఇస్తున్నటువంటి రైతు పక్షపాతి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. రైతులకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ప్రజలంతా పట్టం కట్టారని తెలిపారు .దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా చేనేత బీమా 24 గంటల నాణ్యమై ఉచిత విద్యుత్ దళితబంధు, కల్యాణలక్ష్మీతో పాటు మరిన్ని పథకాలు ప్రవేశపెట్టారన్నారు .ఈ కార్యక్రమంలో మోటకొండూర్ జెడ్పీటీసీ పల్ల వెంకట్ రెడ్డి , మదర్ డైరీ డైరెక్టర్లు కోట్ల జలంధర్ రెడ్డి , జయ శ్రీ, ఉప్పల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.