Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
అధికారుల నిర్లక్ష్యంతో మరణించిన అంగన్వాడీ టీచర్ పోతురాజుల పద్మ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స గ్రేషియా, కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం బీబీనగర్ లో అంగన్వాడీల సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారులు పని ఒత్తిడి చేసినందువల్లనే నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన అంగన్వాడీ టీచర్ పోతురాజుల పద్మ బీపీి, షుగర్ తో ప్రైవేట్ హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ చెందిందన్నారు. పని భారం ఎక్కువవుతుంది తగ్గించండని ప్రతి సందర్భంలో అధికారులకు, ప్రభుత్వాలకు అంగన్వాడీలు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా అంగన్వాడీలకు పని భారాన్ని తగ్గించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సందెల రాజేష్, షాహెద, శారద, రాధిక, పద్మ, సునిత, లావణ్య, బాలమణి, అరుణ, వసంత, నాగలక్ష్మి, ధనలక్ష్మి, శ్యామల పాల్గొన్నారు.