Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాకేంద్రానికి చెందిన గిరిజన న్యాయవాద విద్యార్థి నిఖిల్‌నాయక్ హత్య కేసులో సిట్టింగ్ జడ్జి చేత జ్యూడిషియల్ విచారణ చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి లచ్చీరామ్నాయక్, జిల్లా ఇన్చార్జి ధరావత్ వీరన్ననాయక్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి యాతాకుల రాజన్న,గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు వెంకటేష్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నిఖిల్ హత్య కేసు మిస్టరీని ఛేదించాలంటే సిట్టింగ్ జడ్జి చేత జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లా సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాకేంద్రంలో రైతుబజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుండి తెలంగాణతల్లి విగ్రహం వరకు నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిఖిల్ హత్య జరిగి పదిరోజులువున్నా సరైన ఆధారాలు లభించకపోవడం దారుణమన్నారు.జాతీయ రహదారిపై సీసీ ఫుటేజీలు పనిచేయక పోవడంతో ఈ హత్య కేసు మిస్టరీగా మారిందని ఇది ముమ్మాటికి పోలీసుల వైఫల్యమేనన్నారు.ఈ కేసు విషయంలో ఎస్పీ నుండి కిందిస్థాయి అధికారి వరకు నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు.కేసు పక్కదారి పడుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్ననాయక్,రాజేష్‌నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాంనాయక్,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు, వ్యవసాయకార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి గంటా నాగయ్య ,మాజీ కౌన్సిలర్ చంద్రనాయక్,ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్‌నాయక్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు పోలబోయిన కిరణ్, పీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు, పీవైఎల్ జిల్లా కార్యదర్శి కునుకుంట్ల సైదులు, రామచంద్రం వర్గం నాయకులు బుద్ధ సత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకూరినర్సయ్య, ప్రజాపంథా,పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు సింహాద్రి,రామోజీనాయక్, గిరిజన సంఘాల నాయకులు ధర్మ, వీరన్ననాయక్,శ్రీనునాయక్,వెంకన్ననాయక్, నాగునాయక్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రవి, టీవీవీ జిల్లా కార్యదర్శి గుండాలసందీప్, ఎమ్మార్పీఎస్ నాయకులు వినయ్‌బాబు, సీఐటీయూ నాయకులు సుందరయ్య పాల్గొన్నారు.