Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్రూరల్
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ప్రయివేటీ కరించేందుకు కుట్ర చేస్తున్నట్టు రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి దుగ్గిబ్రహ్మం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ సంఘం మండల మహాసభలో ఆయన మాట్లాడారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వామినాదన్ కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. వ్యవసాయరంగాన్ని ప్రయివేటీకరించే దిశగా గతంలో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి కృషిచేస్తుందన్నారు.రైతాంగం పేరుతో వాటిని రద్దు చేస్తున్న ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్, పురుగు మందులు, ఎరువులధరలను పెంచుతూ మరో రూపంలో రైతులకు ఉపయోగపడని నల్లచట్టాలను అమలు చేస్తుందన్నారు.కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల రుణమాఫీ అమలు చేయాలని తెలిపారు.అనంతరం రైతుసంఘం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మీగడ రాములు, ప్రధాన కార్యదర్శిగా చిన్నపురెడ్డి వెంకటరెడ్డిలతో పాటు మరో 8 మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో చింతకుంట్ల వీరయ్య, నూకలలక్ష్మీనర్సమ్మ, చీకూరి తిరుపతయ్య, కె.సైదా, తేనె రాములు, కారుపల్లి శ్రీనివాస్, తంగేళ్ల వెంకటచంద్ర, రేపాకులమురళి, గుత్తులవెంకటేశ్వర్లు, మధూరి నర్సింహాచారి, శ్రీను పాల్గొన్నారు.