Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ హేమంత్ కేశవ్‌పాటిల్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో బోదరహిత సమాజానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ పాటిల్‌హేమంత్ కేశవ్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో బోద మాత్రల పంపిణీ కార్యక్రమంపై జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటజిల్లాలో 2306 ప్రత్యేక బందాల ఆధ్వర్యంలో,సుమారు పదిమంది ప్రత్యేక అధికారుల సమన్వయంతో,జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను సమన్వయపరుస్తున్నాయన్నారు.ప్రతి ఒక్కరూ డీఈసీ ఆల్బెండజోల్ మాత్రలు మింగే విధంగా అక్టోబర్ ఈనెల 20 నుంచి బోదకాలు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు.సూర్యాపేట జిల్లాలో దాదాపు 5271 కేసులు ఉన్నాయని, అందులో 2300 మంది తెలంగాణ ప్రభుత్వం తరపున పెన్షన్ అందుకున్నట్టు తెలిపారు.డీఎంహెచ్ఓ కోటాచలం మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సూర్యాపేటలో ఇప్పటికే శిక్షణా కార్యక్రమాలు పూర్తయ్యాయన్నారు.మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో శిక్షణా కార్యక్రమం నిర్వహించామన్నారు.కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ నాజియా మాట్లాడుతూ బోధవ్యాధి కలగజేసే దోమల పెరుగుదల వల్ల కొన్ని ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా ఉందన్నారు.దీనిని అరికట్టేందుకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకొని పారిశుధ్యం మెరుగుపడేలా చూడాలన్నారు.వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ మాత్రలు మింగేలా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నిరంజన్,డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి,డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ జయ, మాస్మీడియాఅధికారి అంజయ్య,కిరణ్, అరుణ,కృష్ణమూర్తి దయానందరాణి,అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.