Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర సహాయ కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్
నవతెలంగాణ -నల్లగొండ
ఎస్ఎఫ్ఐ అఖిలభారత 17వ డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ, ఠాగూర్ ఆడిటోరియంలో జరుగనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శంకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. దేశ నలుమూలల నుండి 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తీర్మానాలు చేసి భవిష్యత్తులో ఆయా సమస్యల పరిష్కారానికి ఉద్యమించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నల్గొండ జిల్లా అధ్యక్షులు ఆకారపూ నరేష్,, రేణుక ,సైదానాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకట్, రమేష్ ,సాయి తదితరులు పాల్గొన్నారు.