Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనమంటున్న పట్టణ ప్రజలు
నవతెలంగాణ -ఆలేరుటౌన్
పురపాలక సంఘంలో రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు మెయిన్ రోడ్డుపై మిషన్ భగీరథ పనుల కోసం గుంతలు తీసి తూతూమంత్రంగా పూడ్చడంతో పట్టణంలో చెత్త సేకరించే ట్రాక్టర్ కూరుకుపోయింది. గుంతలు తీస్తున్న పనులపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం , కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మిషన్ భగీరథ పూడికతీత పనులు ఉన్నాయని పట్టణానికి చెందిన దుకాణ సముదాయం వ్యాపారులు పేర్కొన్నారు . నియోజకవర్గ కేంద్రమైన ఆలేర్ పట్టణం పురపాలక సంఘం లొి గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ , ఇతర కేబుల్ పనులు కోసం పురపాలక సంఘం ,ఇతర అధికారుల అనుమతులు సైతం తీసుకోకుండానే ఇష్టారాజ్యంగా ప్రయివేట్ కాంట్రాక్టర్లు గుంతలు తీసి రోడ్డుకిరువైపులా గుంతలు తీసి పూడ్చి వేయకుండానే వదిలేశారు. పని కోసం తవ్విన గోతిని సరిగా పూడ్చకపోవడంతో బస్టాండ్ ఎదురుగా క్లాప్ స్టోర్ ముందు చెత్తను సేకరించే ట్రాక్టర్ దిగబడిపోయింది.
పట్టణంలో అధికారుల అలసత్వం కారణంగానే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో పనులు చేసి వదులు పెడుతున్నారని పట్టణంలోని దుకాణ సముదాయం యజమానులు పేర్కొన్నారు . పట్టణంలోని పాదచారుల సౌకర్యార్థం వెంటనే రహదారికి ఇరువైపులా ఫుట్పాత్ నిర్మాణం చేపట్టి ,గుంతలు తియ్యకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనిపట్టణానికి చెందిన బందెల సుభాష్ అధికారులను కోరుతున్నారు.