Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన ఆశ్రమ పాఠశాల నిధుల మంజూరు కోసం రూ. 50వేలతో ఒకరు..
- ఫెర్టిలైజర్ లైసెన్స్ కోసం రూ.లక్షతో మరొకరు ఏసీబీకి చిక్కిన వైనం
నవతెలంగాణ -భువనగిరిరూరల్
యాదాద్రిభువనగిరి జిల్లాలో అవినీతి తిమింగాలు అధికమవుతున్నాయి. వారం రోజుల్లో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. భువనగిరి పట్టణంలోని గిరిజన బాలికల హాస్టల్ వార్డెన్ దగ్గర రూ.50 వేల లంచం తీసుకుంటూ ఉండగా.. ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. భువనగిరిలోని పట్టణంలోని గిరిజన బాలికల హాస్టల్ భవన నిర్మాణ నిధుల కోసం రూ. లక్ష మంజూరు చేయాల్సి ఉంది. ఈ విషయమై హాస్టల్ వార్డెన్ గత నెల (సెప్టెంబర్)లో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మంగ్తా నాయక్ సంప్రదించింది. రూ. ఒక లక్షలో తనకు రూ. 50 వేలు ఇవ్వాలని మంగ్తానాయక్ వార్డెన్ సూచించాడు. దీంతో వార్డెన్ రూ. 50 వేలు తీసుకొని నల్లగొండలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లింది. రూ. 50 వేల విషయం గురించి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. తాము సూచించిన విధంగా హాస్టల్ వార్డెన్ నల్గొండ నుండి యాదాద్రి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోకి వెళ్లి మంగ్తా నాయక్ వార్డెన్ కలువగా.. ఆయన రూ. 50 వేలను కార్యాలయంలోని బీరువాలో ఫైల్స్ కింద పెట్టమని చెప్పటంతో వార్డెన్ డబ్బులను అక్కడ పెట్టి బయటకి వచ్చింది. బయట ఉన్న తమకు వార్డెన్ డబ్బులు అక్కడ పెట్టిన విషయం చెప్పటంతో వెంటనే లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న డబ్బులను స్వాధీనం చేసుకొని కోర్టుకు పంపారు.
వారం రోజులు వ్యవధిలో రెండవ ఘటన
భువనగిరి మండలం అనాజిపురం గ్రామంలో ఫెర్టిలైజర్ షాప్ ఎరువుల దుకాణం కోసం జూలై 19వ 2022 వ తేదీన లైసెన్స్ కోసం రంగారెడ్డి జిల్లాకు చెందిన వేముల విజరు, రాజు ఎరువుల వ్యాపారం చేస్తున్నారు. వారు లైసెన్స్ కోసం భువనగిరి ఏవో వెంకటేశ్వర్ రెడ్డిని సంప్రదించగా, రెండు లక్షల రూపాయలు లంచం ఇస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తానని తెలిపారు. వారు నల్గొండ ఏసీబీ అధికారులు సూచన మేరకు లక్ష రూపాయలు తీసుకువచ్చి, పాత మున్సిపల్ ఆఫీసులో గల భువనగిరి మండల వ్యవసాయ అధికారుల కార్యాలయంలో అందజేస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, వారిని విచారించారు.వారం రోజుల్లో ఒక జిల్లా స్థాయి అధికారులు 50 వేలు లంచం తీసుకుంటూ పాటుపడడం, మరో మండల అధికారి ఎరువుల దుకాణం కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేసి పట్టుబడడంతో జిల్లాలో అవినీతి తిమింగలాలు పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా ప్రభుత్వ అధికారులు సక్రమంగా జీతం తీసుకుని విధులు నిర్వహించాల్సి ఉండగా తెరచాటుగా అత్యాశకు పోయి అధిక డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో ఇలాంటి వాటికి పాల్పడితే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అన్ని శాఖలలో ఏదో ఒక రకంగా ఇలాంటి పరిస్థితి నెలకొంది జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పనితీరు మారుతుందా లేదా ఎప్పటిలాగే యధావిధిగా కొనసాగుతుందా అనేది వేచి చూడాలి..