Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ ప్రయోజనం కోసమో ప్రజలకు వివరించాలి
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
మండలంలోని రామన్నపేట, కొమ్మాయిగూడం రెవిన్యూ గ్రామాల పరిదిలో ఉన్న భూములను ఏ ప్రయోజనాల కోసం కొనుగోలు చేస్తున్నారో పరిసర ప్రాంత రైతులకు, ప్రజలకు తెలియపర్చాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య డిమాండ్ అన్నారు. గురువారం స్థానిక తహసిల్థార్ ఆంజనేయులుకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట, కొమ్మాయిగూడెం, సిరిపురం గ్రామాల పరిదిలో ఉన్న భూములను ఇప్పటివరకు ప్రయివేటు వ్యక్తులు సుమారుగా 200 ఎకరాలు కొనుగోలు చేశారాన్నారు. ఏ ప్రయోజనం కోసం రైతుల నుండి కొనుగోలు చేస్తున్నారో తెలియక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. ఎలాంటి విష రసాయణాల పరిశ్రమను నెలకొల్పుతున్నారోనని గ్రామాల ప్రజలు, రైతులు తెలిసిన వారిని ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎవ్వరు కూడా సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. చుట్టుపక్కల రైతులు అందరూ భూములు అమ్ముకుంటుంటే గత్యంతరం లేక మరికొంత కొంతమంది రైతులు ఇష్టం లేకున్నా అమ్ముకుంటున్నారన్నారు. దివిస్ పరిశ్రమ ఏర్పడుతుందని ప్రజల్లో విస్తృత ప్రచారం జరుగుతుందడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్న ప్రభుత్వ అధికారులు చోద్యం చూస్తున్నారేతప్ప భయాందోళన నివృత్తికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, నాయకులు కందుల హనుమంతు, గొరిగె సోములు, ఎర్ర కాటమయ్య, పిట్టల శ్రీనివాస్, శానగొండ వెంకటేశ్వర్లు, పబ్బు స్వామి తదితరులు పాల్గొన్నారు.