Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్ చింత ప్రభాకర్
నవతెలంగాణ- చౌటుప్పల్
సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తాయని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మెన్‌్ చింత ప్రభాకర్ అన్నారు. గురువారం మున్సిపాలిటీలోని 11వ వార్డులో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓట్లు వేసి ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సింగిల్‌విండో ఛైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, నాయకులు తిరందాసు ధనుంజయ, ఉడుగు మల్లేశ్‌గౌడ్, కందగట్ల బిక్షపతి, గోశిక కరుణాకర్, తాడూరి పరమేశ్, గోశిక నర్సింహా, బొంగు జంగయ్యగౌడ్, చింతల వెంకట్‌రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
- టీఆర్ఎస్తోనే మునుగోడు అభివృద్ధి
టీఆర్ఎస్తోనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సతీమణి కూసుకుంట్ల అరుణ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలోని 3వ వార్డులో సీపీఐ(ఎం), సీపీఐ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఆమె మహిళలకు బొట్టు పెట్టి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓట్లు వేసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూసుకుంట్ల రమ్య, వల్లందాసు సతీశ్‌గౌడ్, స్వాతి, పర్నె ధర్మారెడ్డి, బాతరాజు దశరథ, ఎర్ర ఊషయ్య, ఎడ్ల మహేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్, నర్సింహా, దుర్గయ్య, క్రాంతి, నర్సిరెడ్డి, రోషయ్య, లక్ష్మణ్ పాల్గొన్నారు.
- మునుగోడులో కూసుకుంట్ల గెలుపు ఖాయం
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ
మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ(ఎం), సీపీఐ బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని హైద్రాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధీమా వ్యక్తంచేశారు. గురువారం మున్సిపల్ పరిధిలోని తంగడపల్లిలోని 4,15 వార్డుల్లో మిత్రపక్షాల నాయకులతో కలిసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊదరి యాదయ్య, ఉబ్బు నర్సింహా, బాలగోని శ్రీను, గ్యార కిష్టయ్య, జిట్టా కృష్ణ, కొమ్ము యాదయ్య పాల్గొన్నారు.