Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇన్చార్జి డీసీఓ శ్రీనివాస్
నవతెలంగాణ -కోదాడరూరల్
వానకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా ఇన్చార్జి డీసీఓ డి. శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక పిఎసిఎస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డివిజన్ పరిధిలోని పీఏసీఎస్ సీఈఓలు, కంప్యూటర్ ఆపరేటర్లతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వానాకాలం సీజన్లో రైతుల పండించిన ధాన్యం కొనుగోలు చేస్తున్నందున దానికి తగ్గట్లుగా అధికారులు అప్రమత్తంగా ఉండి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం ఆయన్ను పీఏసీఎస్ చైర్మెన్ ఆవుల రామారావు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ రిజిస్టార్ ఇందిరా, సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, సీఈఓ లు మంద వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కృష్ణ, శ్రీనివాసరెడ్డి, బసవయ్య, యలమందరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.