Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐక్య విద్యార్థి గిరిజన సంఘాలు
నవతెలంగాణ-సూర్యాపేట
నిఖిల్ హత్య కు కారకులు అయినా వ్యక్తులను వెంటనే పోలీస్ లు అరెస్టు చేయాలనీ ఐక్య విద్యార్థి గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన ర్యాలీ లో వారు మాట్లాడారు.నిఖిల్ హత్య జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు నిందితులను రిమాండ్ చేయలేదని విమర్శించారు. పోలీసులు విచారణ చేయడం లేదని వారు ఆరోపించారు. నిందితులను పట్టుకునే వరకు పోరాటం ఆగదన్నారు.నిఖిల్ నాయక్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, ఆలిండియా బంజారా సేవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధరావత్ వీరన్న నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర నాయకులు వెంకటేష్ నాయక్,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య యాదవ్, టీవీవీ జిల్లా అధ్యక్షులు గుండాల సందీప్,టి.యస్.ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భారీ అశోక్,ఆర్.వి.యస్.పి రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు, జనసేవ సమితి తగుళ్ల జనార్దన్ యాదవ్,పి.డి.యస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు మరికంటి హరీష్,18వ వార్డ్ మాజీ కౌన్సిలర్ వంకుడొత్ జితేందర్ సింగ్, ఆలిండియా బంజారా సేవ సంఘం జిల్లా నాయకులు పాండు నాయక్, సమీర్,యస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షులు బానోత్ వినోద్ కుమార్, ఉప్పుల మధు యాదవ్, శ్రావణి, సరిత, కావ్య, వీరబోయిన మల్లికార్జున్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.