Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-సూర్యాపేట
రాజ్యాంగం రద్దు చేసి రిజర్వేషన్లను తొలగిస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్న మతోన్మాద బీజేపీ మూలంగా రాజ్యాంగానికి ప్రమాదం పొంచి ఉందని, రాజ్యాంగ రక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు.గురువారం స్థానిక ఎంవిఎన్ భవన్లో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ 8 ఏండ్ల పాలనలో దళితులపై 300రేట్లు దాడులు, మహిళలపై 200 రేట్లు దాడులు పెరిగాయాన్నారు. రాజ్యాంగం రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్రలు చేస్తుందన్నారు. బీజేపీ నిర్మొహమాటంగా రాజ్యాంగం రద్దు చేస్తామని చెప్పిన విషయం గుర్తుచేశారు.దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు, హత్యలు పెట్రేగిపోతున్నా అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. బీజేపీ దళిత బలహీనవర్గాల బద్ధ శత్రువని అది ఒక విష సర్పం వంటిదని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమి ద్వారా రాజ్యాంగం ప్రజాస్వామిక హక్కులు కాపాడాలని చెప్పారు. బీజేపీ దళిత బలహీన వర్గాలకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా లేకుండా చేస్తుందన్నారు. ప్రేమించిన దళిత గిరిజన యువకులను కులం పేరుతో హత్యలు చేయడం దుర్మార్గన్నారు. జిల్లా కేంద్రానికి చెందిన గిరిజన యువకుడు నిఖిల్ను హత్య చేసిన దుండగులను గుర్తించకపోవడం సరికాదన్నారు.నిఖిల్ హత్యపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి,జిల్లా ఆఫీస్ బేరర్స్ బొడ్డుపల్లి వెంకటరమణ, గుద్దేటి వెంకన్న,నందిగామ సైదులు,పిండిగ నాగమణి, దుర్గారావు,ఏసు, ఇరుగు రమణ తదితరులు పాల్గొన్నారు.