Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శవర్గ సభ్యులు
నవతెలంగాణ-నిడమనూరు
నవంబర్ 8, 9,10తేదిలలో జరిగే రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్నపాక లక్ష్మినారాయణ కోరారు. గురువారం మండల కేంద్రంలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు, బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికారం చేపట్టిన నాటి నుండి కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని మతోన్మాదం, హత్యలు, దళితులపై మైనార్టీలపై, మేధావులపై జర్నలిస్టులపై దాడులు దౌర్జన్యాలు కొనసాగుతున్నాయన్నారు. రూపాయి విలువ పతనానికి చేరుకుంటుందని, తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అన్ని విధాలా ఆదుకొని న్యాయం చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా రైతాంగం పోరాడి కేంద్ర ప్రభుత్వం పై విజయం సాధించిన ఉద్యమ స్ఫూర్తితో నల్లగొండ పట్టణంలో జరిగే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలను అన్ని వర్గాల ప్రజలు రైతులు మేధావులు జయప్రదం చేయాలని వారు కోరారు. అనంతరం మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కత్తి లింగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శీను, మండల కార్యదర్శి కందుకూరి కోటేష్, మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, నల్లబోతు సోమయ్య మలికంటి చంద్రశేఖర్, కుంచెం శేఖర్, వింజమూరి శివ, తదితరులు పాల్గొన్నారు.