Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సూర్యాపేట
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మోడీ,బీజేపీ పార్టీల తీరును ఎండగడుతూ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్ ల ఆధ్వర్యంలో గురువారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మెన్ పుట్ట కిషోర్ మాట్లాడుతూ భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోడీ ప్రభుత్వం అపహాస్యం పాలు చేస్తోందన్నారు. ప్రజలచేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలతో కొనాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గుండూరి కపాకర్ పావని,జహీర్,రాపర్తి శ్రీనివాస్, చింతలపాటి భరత్, ఆకుల లవకుశ, సయ్యద్ సలీం, సల్మా, ,అంజమ్మ ఎం వి ఎల్, చందుపట్ల పద్మయ్యా, జ్యోతి కరుణాకర్,నిమ్మల వెంకన్న, గౌస్ బారు, చిరువెళ్ల లక్ష్మి కాంతమ్మ ,కోడి సైదులు, కెక్కిరిని నాగయ్య,బావసింగ్,వెన్న శ్రీనివాస్ రెడ్డి,పందిరి మల్లేశ్,బొలిశెట్టి మధు,గాజుల రాంబయమ్మ,రామా కిరణ్,గుణగంటి శ్రీను,షేకిల్,బోలెద్దూ వినరు, జానీ, మీరా,తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో టీిఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో, ఖమ్మం క్రాస్ రోడ్లో ఆ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను గురువారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చింతా కవితా రాధారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో టీిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కుట్ర చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కోట మధు, కందుల చంద్రశేఖర్, సంపేట ఉపేందర్ గౌడ్, వంటి పులి రమా శ్రీనివాస్ ,కట్టే బోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, మైస రమేష్, మేదర లలిత, గ్రంథాలయ చైర్మెన్ రహీం , మండల ప్రధాన కార్యదర్శి సురేష్ నాయుడు, సర్పంచులు,పీఏసీఎస్ చైర్మెన్లు, తదితరులు పాల్గొన్నారు.
మునగాల : బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ టీిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మెన్ కందిబండ సత్యనారాయణ, ఆపార్టీ సీనియ ర్ నాయకులు నల్లపాటి శ్రీనివాస్,మండల కార్యదర్శి ఎలక వెంకట్ రెడ్డి,మున గాల గ్రామ శాఖ అధ్యక్షులు ఉడుం కృష్ణ,ఎల్.పి.రామయ్య, నల్లపాటి నాగరా జు అంజయ్య,, శ్రీనివాస్,ఎస్కే సైదా, ఎల్ శ్రీను,నారగాని వెంకన్న,నాగేశ్వర రావు పాల్గొన్నారు.
చివ్వేంల : బీజేపీి వందల కోట్ల రూపాయలు వెదజల్లి టీిఆర్ఎస్ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి కుట్రలు చేస్తుందని కాని వారి కుట్రలు, పన్నగాలు కేసీఆర్ ముందు ఏమాత్రం చెల్లవని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జూలకంటి సుధాకర్ రెడ్డి అన్నారు.
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను కొనుగోలు చేయడానికి ఢిల్లీ కి చెందిన స్వామిజిలను పంపిన బీజేపీనాయకులు డబ్బు సంచులతో పట్టుబడిన సంఘటనకు నిరసనగా గురువారం మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రౌతు నర్సింహా రావు, టిఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షుడు పుట్ట గురువేందర్, సేవలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య నాగు నాయక్, టీఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు రత్నావత్ నాగరాజు, అనిల్, బికారి, పల్లేటి నాగయ్య, సాగర్, రమేష్ రెడ్డి, లచ్చిరాం, , వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
మద్దిరాల : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ గురువారం మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో తెరాస పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ వందల కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే కుట్రను నిరసిస్తూ ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర వెంకన్న, మండల సర్పంచుల పోరం అధ్యక్షుడు కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రం లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కన్నా వీరన్న కోడి శ్రీను ఆపార్టీ సర్పంచులు దామెర్ల వెంకన్న,వెలుగు వెంకన్న , నాగెళ్లి శ్రవణ్ కుమార్,మరెల్లి యాకయ్యఎస్సీసెల్ మండల అధ్యక్షుడు గోల్కొండ మల్లేష్, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మోడీ దిష్టిబొమ్మ దగ్ధం నవ తెలంగాణ
మోతే : ఎమ్మెల్యేలకు డబ్బులు ఎర్ర చూపి బీజేపీలో చేర్పించేందుకు కుతంత్రాలకు నిరసనగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ , కేంద్ర హోం మంత్రి అమితుషా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శ్రేణులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
సూర్యాపేట రూరల్ : టీఆర్ఎస్కు మునుగోడులో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ నాయకత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రకు తెరలేపారని ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి అన్నారు.గురువారం మండల పరిధిలోని సోలిపేటలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.మోడీ,అమిత్ షా ల రాజకీయ వేలం ఆటపాటలు తెలంగాణలో సాగవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామసాని శ్రీనివాస్ నాయుడు, ఎంపిటిసి మామిడి కిరణ్ ,తెరాస గ్రామశాఖ అధ్యక్షులు ఉగ్గం మల్లిఖార్జున్, నాయకులు గోగిరెడ్డి వెంకట్ రెడ్డి,సూరం లక్ష్మికాంత్ రెడ్డి,నర్ర పరమేష్ మోహన్ రెడ్డి,దామోదర్ రెడ్డి,పోలెపాక శ్యామ్ సుందర్,కడారి కరుణాకర్ రెడ్డి,తప్పెట్ల మహేష్,కోక జానయ్య,మోదాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : డబ్బు ఆశ చూపి నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ను కొనుగోలు కు ప్రయత్నం చేసిన బీజేపీ వైఖరిని ఖండిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం పట్టణ కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీిఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగండ్ల శ్రీధర్, ఆకారపు వెంకటేశ్వర్లు, చిత్తలూరి సైదులు గుర్రం మార్కండేయ యామిని వీరయ్య పల్లెపంగ నాగరాజు, సులువ యాదగిరి, భరత్, సుందరయ్య, ఇంజమూరి మల్లయ్య,ఐత శ్రీను పాల్గొన్నారు.
నూతనకల్ : బీజేపీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకుడబ్బులు ఎరగా చూయించి, బెదిరింపులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం ప్రధాని చేస్తున్నదని టీిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిల్ గౌడ్. టిఆర్ఎస్ అధికార ప్రతినిధి బత్తుల విద్యాసాగర్ . అన్నారు , గురువారం మండల కేంద్రంలో మోడీ బొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బత్తుల విజరు కుమార్ .నూతనకల్ గ్రామ శాఖ అధ్యక్షులు మొగుళ్ల వెంకన్న. మూరగుండ్ల సైదులు . మిరియాల చిరంజీవి. గ్రామ శాఖ కార్యదర్శి బత్తుల సురేష్ మిరియాల ప్రవీణ్. కుమారు. మిరియాల నరేష్ మాతంగి ఎల్లయ్య .పాల్వాయి ఎల్లయ్య కోటేష్. సావాది సత్తిరెడ్డి .తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు ఎస్ : టీిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు నిరసనగా ఆ పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండలకేంద్రంలోని నిమ్మికల్ ధర్నా చౌక్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ముద్దం కృష్ణారెడ్డి , పీఏసీఎస్ చైర్మెన్ కొనతం సత్యనారాయణ రెడ్డి,టీఆర్ఎస్ మండల కార్యదర్శి బత్తుల ప్రసాద్, అధికార, ప్రతినిధి లింగాల గుంశవలి, దండు మైసమ్మ ఆలయ మాజీ చైర్మెన్ బెల్లంకొండ యాధగిరి గౌడ్, బ్రహ్మం గౌడ్, సాన బోయిన సుధాకర్ , పగడాల ఉపేందర్ పాల్గొన్నారు.
నాగారం :మండల కేంద్రంలో గురువారం మోడీ దిష్టిబొమ్మను టీిఆర్ఎస్ మండల నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధికార ప్రతినిధి చిల్లర చంద్రమౌళి మాట్లాడుతూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధికారాన్ని చేపట్టాలనుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా దిష్టిబొమ్మను దహనం చేసినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో మండల యువజన సంఘం అధ్యక్షులు ఈదుల కిరణ్ కుమార్ టిఆర్ఎస్ మండల నాయకులు కన్నేబోయిన మల్లేషు, దోమల బాలమల్లు, మల్యాల అశోక్, తరాల ఆంజనేయులు, చిప్పలపల్లి మల్లేష్, చిప్పలపల్లి ఉపేందర్ పాల్గొన్నారు.
తిరుమలగిరి : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బుధవారం మొయినాబాద్ గెస్ట్ హౌస్ లో తెరాస పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వందల కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే కుట్రను నిరసిస్తూ గురువారం మండల కేంద్రంలోని చౌరస్తానందు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోడీ,కిషన్ రెడ్డి,బండి సంజరు ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీపట్టణ అధ్యక్షులు తిరుమని యాదగిరి, నాయకులు నరోత్తం రెడ్డి, మహేశ్వరం సందీప్ నేత, మోడెపు సురేందర్, వేణు, కందుకూరి బాబు, జగన్, గ్రామ సర్పంచులు, కమిటీ అధ్యక్ష కార్యదర్శులు,తెరాస మండల,గ్రామ యూత్ అధ్యక్షులు,సభ్యులు,సీనియర్,పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.