Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాలిలో కలుస్తున్న జానపాడు సైదన్న భక్తుల ప్రాణాలు
- బాధ్యతను మరుస్తున్న వక్ఫ్‌బోర్డు
- పుష్కర ఘాట్ లో పోలీసుల పహారా ఉండాలంటున్న స్థానికులు
నవతెలంగాణ-పాలకీడు
మండలం మహంకాళి గూడెం కృష్ణా నది పుష్కర ఘాట్ ప్రమాదాలకు నిలయంగా మారింది. సదూర ప్రాంతాల నుంచి జాన్పాడుదర్గా కు వచ్చే భక్తులు, స్థానమాచరించడానికి నదిలోకి దిగి మృత్యువు ఒడిలోకి చేరుకుంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలుఅనేకంగా జరుగుతున్న, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయినప్పుడు హడావుడి చేసి తర్వాత అక్కడి భద్రతకు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం గుంటూరు కి చెందిన ఇద్దరు మృతిచెందారు. అంతకుముందు మరో ఇద్దరు, ఐదు నెలల క్రితం ఒక బాలుడు మృతిచెందారు. కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రాణాలు పోగొట్టుకున్న వారంతా సుదూర ప్రాంతాల నుంచి జాన్పహాడుదర్గాకు వచ్చిన భక్తులే కావడం విశేషం. అసలు ప్రమాదాలకు కారణాలను నవతెలంగాణ క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జానపాడు సైదన్న దర్గాకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి సైతం వస్తుంటారు. కృష్ణానది ప్రవాహం పై వీరికి అవగాహన లేకపోవడం వల్లనే ప్రాణాలు కోల్పోతున్నారు. పుష్కర ఘాటులో మూడంచెల జాలిని ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి. సంవత్సరం పొడుగునా కృష్ణమ్మ ప్రవాహం వివిధ రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం పైనుంచి వరద ఉధృతంగా రావడంతో ప్రమాదాలకు అవకాశం ఎక్కువ అని స్థానికులు తెలిపారు. మరోపక్క సంవత్సరానికి కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించే వర్క్స్ బోర్డు పవిత్ర దర్గా వద్ద అరకోరగానే స్నాన ఘట్టాలు ఏర్పాటు చేసింది. నీటి వసతి ఏర్పాటు చేసి సరిగ్గా నిర్వహణ కృష్ణా నదికి వెళ్లే అవసరం ఉండదనేది స్థానికుల అభిప్రాయం. కనీసం దర్గా వద్ద మైకు ద్వారానైనా నదీ ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేయకపోవడం, వారు నిర్లక్ష్యానికి అద్ధం పడుతుంది. గతంలో కేవలం వారంలో శుక్రవారం మాత్రమే దర్గాకు భక్తులు వచ్చేవారు. ప్రస్తుతం కొన్నేండ్లుగా అలాంటి నియమమేమీ లేదు. ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. వచ్చిన వీరు పుష్కర్ ఘాట్ వద్ద ఏర్పాటుచేసిన నామమాత్రపు ప్రమాద హెచ్చరికలను పట్టించుకోవడం లేదు. విహారయాత్రకు వచ్చామని భావించి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పుష్కర ఘాటు వద్ద ప్రతిరోజు భద్రతను పోలీసులు మానిటరింగ్ చేస్తే ప్రమాదాలు జరగవు. స్థానిక మత్స్యకారులు ప్రమాదం పొంచి ఉందని చెప్పినా భక్తులు పేడ చెవిన పెడుతున్నారని వాపోతున్నారు. తీరా ప్రమాదం జరిగాక మతదేహాలను మా చేతులతోనే బయటికి తీయడం బాధగా ఉందంటున్నారు స్థానిక మత్స్యకారులు. ఈ ప్రమాదాలు ఆగాలంటే పోలీసుల సందోబస్తు తప్పనిసరి అంటున్నారు. స్థానిక సర్పంచ్ శ్వేతా విజరు. డీివైఎఫ్‌ఐ, గిరిజన సంఘం నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా శాశ్వత పరిష్కారం లభించకపోవడం పై పెదవి విరుస్తున్నారు. అధికారులు ఈ పుష్కర ఘాటు పై ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని, దర్గా వద్ద వక్ఫ్బోర్డ్డ్ు భక్తులకు మరిన్ని వసతులు కల్పించి, నది ప్రమాదాలపై భక్తులకు అవగాహన పెంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.