Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలేరు ,రాజపేట మండలాల నేతల మధ్య తీవ్ర పోటీ
- ఎమ్మెల్యే గొంగిడి దంపతుల ఆశీస్సుల కోసం పాట్లు
- మునుగోడు ఉపఎన్నిక తర్వాత నూతన పాలకవర్గ నియామకం
- ఎస్సీ సామాజిక వర్గానిదే ఈ పీఠం..
- 2009 నుండి ఆలేరుకు చెర్మెన్ పీఠం దూరం
నవతెలంగాణ- ఆలేరురూరల్
ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ నియమానికి కసరత్తు నడుస్తుంది. మార్కెట్ కమిటీ గడువు ఈనెల 18న ముగిసింది. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ అమల్లో ఉండడంతో ఈసారి చైర్మెన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ అయింది. ఇక్కడ చైర్మెన్, వైస్ చైర్మెన్ పాలకవర్గ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందరెడ్డి ఎంపిక చేయాల్సి ఉంది.
ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందినవారు ఆలేరు నియోజకవర్గం లోని ఆలేరు ,రాజపేట, యాదగిరిగుట్ట ,తుర్కపల్లి, మోటకొండూరు, గుండాల మండలాల నుండి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చైర్మన్ పీఠం గురించి ఆశిస్తున్నారు.ఆలేరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఉండి 2009 జూన్ నుండి సంవత్సరం నుండి రాజపేట మండలానికి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాలకు చైర్మెన్ పదవి ఇచ్చి ఆలేరు మండలానికి ఇవ్వకపోవడం దురదృష్టకరమని రైతులు భావిస్తున్నారు. ఆలేరు మండలానికి రెండు సార్లు వైస్ చైర్మెన్ పదవి దక్కిఇంది.
ఆలేరు, రాజపేట మండలాల మధ్య చైర్మెన్ పదవి కోసం తీవ్ర పోటీ..
రాజపేట మండలానికి చెందిన గుర్రం నరసింహులు సతీమణి శిరీష, పారుపెళ్లి గ్రామానికి చెందిన మోత్కుపల్లి ప్రవీణు సతీమణి జ్యోతి, ఆలేరు మండలం నుండి జెడ్పీటీసీ పోటీ చేసి ఓడిపోయిన కందుల రామన్ సతీమణి ఇందిరా, ఆలేరు మండల మాజీ ఎంపీపీ కాసగళ్ల అనసూయ వీరి మధ్యన పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నవారికి మార్కెట్ చైర్మెన్ పదవి దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు దళిత నాయకులు తమకు అవకాశం ఇవ్వాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనెల 20న పాలకవర్గం ఎన్నిక ఉండటంతో మునుగోడు ఎన్నికల సందర్భంగా వాయిదా వేయడం జరిగింది ఎన్నికలు పోయినక చెర్మెన్ పదవీ ఎన్నికుంటారు.
ఆలేరు మండలానికి మార్కెట్ పీఠం దక్కాలి
2009 నుండి ఆలేరు మండలానికి మార్కెట్ చైర్మెన్్ లేకపోవడం చుట్టుపక్కల మండలాల చైర్మెన్ ఎన్నిక కావడం బాధాకరమని రైతులు అంటున్నారు. మార్కెట్లో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పుకుందామంటే పక్క మండలాలు నాయకులు పరిచయం లేకపోవడం సమస్యలు పరిష్కారం కావడంలేదని పేర్కొంటున్నారు.తెలంగాణ ఉద్యమ సమయం నుండి పార్టీని అంటూ పెట్టుకొని ఉన్న నాయకులకుచైర్మెన్ పీఠం ఇవ్వాలని కోరుతున్నారు.
స్థానికులకే పదవి దక్కాలి
ఆలేరు మండలంలోని ఏ గ్రామానికి సంబంధించిన వారు అయినా సరే ఆలేరు మార్కెట్ చైర్మెన్ పదవి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు ,నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.