Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -వలిగొండ
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, సకాలంలో రైతుల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని మాంధాపూర్, అక్కంపల్లి, లింగరాజుపల్లి, నాతాళ్లగూడెం గ్రామాలలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించి, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. సీరియల్ ప్రకారం కొనుగోళ్లు నిర్వహించాలని, కొనుగోలు కాగానే ట్యాబ్ ఎంట్రీ చేయాలని, రైతులకు సకాలంలో వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 17 శాతం లోపు తేమ ఉండేలా చూడాలని, ధాన్యం తూర్పార పట్టి నాణ్యతా ప్రమాణాలు ఉండేలా చూడాలని, ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించాలని, టార్పాలిన్స్, గన్నీ బ్యాగులు అందుబాటులో వుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజరు జాని, గ్రామ సంఘాల మహిళలు, విలేజ్ బుక్ కీపర్స్ పాల్గొన్నారు.