Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకతవకలు జరిగితే కిమినల్ కేసులు నమోదు చేస్తాం
- సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలి
- దళారి వ్యవస్థపై గట్టి నిఘా పెట్టాలి
- కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
వానాకాలం ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో వానాకాలం పంట 2022 -23 పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావుతో కలసి కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి వ్యవసాయ శాఖ పంట డేటా ప్రకారం అన్ని కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించి , పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జిల్లా మార్కెటింగ్ శాఖ ద్వారా సంబంధిత పరికారాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు తమ పరిధిలోని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో మాత్రమే విక్రయించే విధంగా అధికారులు అవగాహన కల్పించాలనిసూచించారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చే రైతులకు తప్పక బ్యాంక్ ఖాతా ఉండాలని , కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు జరగాలని అలాగే రైతులకు ధాన్యం డబ్బులు సత్వరమే జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుండి ధాన్యం జిల్లాలో రాకుండా జిల్లా సరిహద్దులు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టులులలో గట్టి నిఘా ఉంచామని ఆదిశగా పొలీస్, రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేశారు. మిల్లర్లు ఎక్కడకూడా రైతులకు ఇబ్బందులు సృష్టించ వద్దని, లేని యెడల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో అవకతవకలు పాల్పడితే అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 8 సెక్టర్లుగా విభజించామని , దాదాపు 320 పైగా లారీలు ఏర్పాటు చేశామని , లారీలను మాత్రమే వినియోగించాలని పేర్కొన్నారు. అన్ని కేంద్రాలలో తప్పక ఫ్లెక్సీ లు ఏర్పాటు చేసి కేంద్రం వివరాలను రైతులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. గన్ని సంచులు 70 లక్షలు ఉండగా మరో కోటి యాభై లక్షల సంచులకు ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామారావు నాయక్, డీఎం రాంపతి నాయక్, జిల్లామార్కెటింగ్ అధికారి సంతోష్, డి.సి.ఓ శ్రీనివాస్, డి.యస్.ఓ పుల్లయ్య, ఐకేపీ,పీఏసీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.