Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గందరగోళానికి తెర..
- రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయం..
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
తెలంగాణలోని యూనివర్సిటీలకు సంబంధించిన కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ నెల 26న విడుదల చేసింది. దీంతో యూనివర్సిటీలలోని డిగ్రీ, పీజీ కోర్సుల షెడ్యూల్‌లకు సంబంధించిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించినట్టు అయింది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. డిగ్రీ మొదటి సెమిస్టర్, పీజీ ఒకటి, మూడు సెమిస్టర్లకు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించారు.
అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం..
మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళ యూనివర్సిటీలలో డిగ్రీ పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ ఒకేసారి తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా ఇంటర్నల్ పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు కూడా ఇకనుండి ఒకేసారి నిర్వహించనున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న ఏడు యూనివర్సిటీలలో వేరు, వేరు అకాడమిక్ క్యాలెండర్లు అమలు చేసేవారు. దీనివల్ల ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో ఇబ్బందులు తలెత్తడంలో అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే క్యాలెండర్‌ను రూపొందించాలని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కామన్ అకాడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ఇప్పటికే ఈ నెల పది నుండి డిగ్రీ, పీజీ విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి.
డిగ్రీ కోర్సుల్లో అకాడమిక్ క్యాలెండర్ (మొదటి సెమిస్టర్)..
తరగతులు ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభం కాగా మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్ 8, 9 డిసెంబర్ 2022 తేదీల్లో నిర్వహించనుండగా రెండవ ఇంటర్నల్ అసెస్మెంట్ 23, 24 జనవరి 2023న నిర్వహిస్తారు. 3 ఫిబ్రవరి2023 తరగతుల ముగింపు. అనంతరం ప్రాక్టికల్స్ ప్రిపరేషన్ కోసం విద్యార్థులకు 4 ఫిబ్రవరి 2023 నుండి 8 ఫిబ్రవరి 2023 వరకు సెలవులు ఇవ్వనున్నారు. సెమిస్టర్ పరీక్షలు 9 ఫిబ్రవరి 2023 నుండి ఉంటాయి.
పీజీ కోర్సుల అకాడమిక్ క్యాలెండర్ (1,3 సెమిస్టర్ వారికి)..
పీజీ కోర్సుల విద్యార్థులకు కూడా తరగతులు ఈ నెల 10 నుండి ప్రారంభం కాగా మొదటి ఇంటర్నల్ అసెస్మెంట్ 22, 23 డిసెంబర్ 2022 తేదీల్లో ఉండగా రెండవ ఇంటర్నల్ అసెస్మెంట్ 9, 10 ఫిబ్రవరి 2023 తేదీల్లో ఉంటాయి. తరగతిల ముగింపు 23 ఫిబ్రవరి 2023న ఉంటుంది. ప్రాక్టికల్స్ ప్రిపరేషన్ సెలవులు 24 ఫిబ్రవరి 2023 నుండి 26 ఫిబ్రవరి 2023 వరకు ఇవ్వనున్నారు. సెమిస్టర్ పరీక్షలు 27 ఫిబ్రవరి 2023 నుండి ఉంటాయి.