Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజగోపాల్రెడ్డి ప్రయోజనం కోసం తెచ్చుకున్న ఉపఎన్నిక..
- టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
- ప్రజానాట్యమండలి ఆటపాటలతో కళా ప్రదర్శన
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-మునుగోడు
బీజేపీ ప్రభుత్వం దేశ కుబేరులలో ఒకరైన అదానీ, అంబానీలకు బినామీలుగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రయోజనం కోసం పేద ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మండలంలోని వెల్మకన్నె గ్రామంలో ప్రజానాట్యమండలి కళాకారులతో కలిసి గ్రామంలో కళా ప్రదర్శనతో ఇంటిట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక ప్రజల కోసం వచ్చిన ఎన్నిక కాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం తీసుకువచ్చి ప్రజలపై విపరీతమైన బారాలు మోపారన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ తమకు కన్నతల్లి లాంటిదని చెప్పుకుంటూనే ఒకపక్క రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీజేపీకి అమ్ముడుపోయి మరోపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్టుగా తమ్ముడు గెలుపు కోసం ప్రజలకు ఫోన్లు చేసి ప్రాధేయ పడుతున్న కోమటిరెడ్డి బ్రదర్స్ బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్ రెడ్డి తమ వ్యాపారాలు కాంట్రాక్టుల కోసం మునుగోడు ప్రజల ఆత్మ అభిమానాన్ని బిజెపికి తాకట్టు పెట్టి అవమానపరిచిన మునుగోడు నియోజకవర్గం ప్రజలు బీజేపీకి డిపాజిట్ దక్కకుండా తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచినందుకు ఓటు వేయాల్నా అని బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ప్రచారం చేసిన గ్రామ గ్రామాల్లో అడ్డుకుంటున్నారని తెలిపారు. మోడీ 8 ఏళ్ల పాలనలో అభివద్ధి అంశాలకు కాకుండా విదేశాలు, విధ్వంసాలు సృష్టించడానికి ఆయన పాలన సాగిందని పేర్కొన్నారు పాత నోట రద్దుతో దేశంలో ఆర్థిక సంక్షేమం ఏర్పడిందని ఇండియాలో డ్రగ్స్ మాఫియా మోడీ, అమిత్ షాల కను సైగలో చీకటి వ్యాపారం జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు చాపల మారయ్య, మండల కార్యదర్శి మిర్యాల భరత్, సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, సీఐటీయూ మండల కార్యదర్శి యాసరాణి శ్రీను, మాజీ ఎంపీటీసీ తలకోల గోపాల్ రెడ్డి, వడ్లమూడి హనుమయ్య, శేఖర్, పర్సన గొని యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.