Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరచడం కోసం బీజేపీ కుట్రలు చేస్తోందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజాస్వామ్య వ్యవస్థని ఖూనీ చేసే విధంగా మొయినాబాద్ గెస్ట్ హౌస్‌లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వందల కోట్ల రూపాయలకు అక్రమ కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. మోసపురితమైన బీజేపీ నీచ రాజకీయాలను తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేయలేరని, బీజేపీ ఆటలు తెలంగాణ రాష్ట్రంలో సాగవని పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ తరహా కుతంత్రాలను చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, కనగల్ ఎంపీపీ కరీంపాష, నల్లగొండ, కనగల్, తిప్పర్తి, మండలాల అధ్యక్షులు, వివిధ వార్డు కౌన్సిలర్లు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.