Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తూతూమంత్రంగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
- బీసీ గురుకుల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలి : చైర్మెన్ బండ
నవతెలంగాణ-నల్లగొండ
నల్లగొండ జిల్లా పరిషత్ సమావేశం గురువారం రెండు గంటల పాటు ఆరు అంశాలపై చర్చించారు. మొత్తం 29 అంశాలపై చర్చించాల్సి ఉండగా, సమయాభావం వల్ల 6 అంశాలపైనే చర్చించి ముగించారు. సాంఘిక విద్యా, వైద్య, ప్రజా ఆరోగ్యం, వెనుకబడిన తరగతుల సంక్షేమ అభివృద్ధి, పశు సంవర్ధక అభివృద్ధి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్‌రెడ్డి అధ్యక్షతన 10:30 నిర్వహించాల్సి ఉండగా రెండు గంటలు ఆలస్యంగా 11:15 గంటలకు ప్రారంభించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మెన్ పెద్దులుతో పాటు అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరై సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో కాంతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఏఈల పనితీరుపై సభ్యులు ఆగ్రహం..
జెడ్పీ సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఏఈల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రతి మూడు నెలలకోసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలకు ఏ ఒక్క ఎలక్ట్రిసిటీ అధికారులు హాజరు కాకపోవడంతో ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించవలసిన అధికారులు సమావేశాలకు రాకపోవడంతో ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయన్నారు. ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చైర్మెన్ సభ్యులు కోరారు. గత సమావేశాలలో ఎలక్ట్రిసిటీ ఎస్ఈ సభ్యులను అగౌరపరిచే విధంగా వ్యవహరించారని, గురువారం జరిగిన సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వలేక అమర్యాదగా సమాధానం చెప్పడంతో సభ్యులు ఆగ్రహించారు.
రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
వానాకాలం సీజన్లో రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. వరి ధాన్యం తేమ విషయంలో అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను సక్రమంగా బడులలో చేయించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. జిల్లాలో మొత్తం ఎన్ని బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయి, ఎంత మంది సిబ్బందిని నియమించారు, సేవలు అందుబాటులోకి వచ్చాయ, దీనిపై వైద్య ఆరోగ్య శాఖ సరైన నివేదిక అందించాలని కోరారు.
జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు : చైర్మెన్
జిల్లాలో వానకాలం సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం 157 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని రైతులు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి అన్నారు. ధాన్యాన్ని దళారులకు కమ్ముకొని మోసపోవద్దన్నారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. జిల్లాలో 147 పీఏ సీఎస్ ,110 ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కోటి ఇరవై లక్షలు గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు . డ్రాప్ అవుట్ విద్యార్ధుల సీట్లు అమ్ముకుంటున్న నార్కట్‌పల్లి బీసీ గురుకుల ప్రిన్సిపాల్ పై తగిన చర్యలు తీసుకోని సస్పెండ్ చేయాలని బీసీ గురుకుల ఆర్ సీవో షకీనను ఆదేశించారు.