Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ వాసుదేవరెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
వికలాంగులకు నెలకు రూ.3,016 పెన్షన్ ఇచ్చి అన్నం పెడుతున్న టీఆర్ఎస్ పార్టీకి సున్నం పెట్టొద్దు అని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ డాక్టర్ వాసుదేవరెడ్డి అన్నారు. గురువారం మర్రిగూడ మండల కేంద్రంలోని వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఇంటింటి ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండల కేంద్రంలోని విజయ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మర్రిగూడ వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రిగూడలో ఉన్న వికలాంగుల సమస్యలను చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రాంత పరిస్థితులను చూసి చలించిపోయి రాష్టం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్‌ను రూపుమాపుతానని ఆనాడు ఇచ్చిన హామీ మేరకు రాష్టం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇంటింటికి మిషన్ భగీరథ నీరు ఇచ్చి ఈ ప్రాంతంను ఫ్లోరోసిస్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎంపీపీ మోహన్ రెడ్డి, సర్పంచ్ నల్ల యాదయ్య,రైతు బంధు సమితి మండల కన్వీనర్ రామకృష్ణ, వికలాంగ సంఘాల ప్రతినిధులు రాములు, అంజి, రాము, తదితరులు పాల్గొన్నారు.