Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
ఆర్టీసీ కార్మికుల పనిభారాలను తగ్గిస్తూ పెరుగు తున్న ధరలకు అనుగుణంగా వేతన సవరణ చేపట్టాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపా ధ్యక్షులు ఎం.రాంబాబు, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) నల్లగొండ డిపో మహాసభ జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షెడ్యూల్స్ మారుస్తూ కేఎంపిఎల్ పేరా కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలు పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించి సంస్థ రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సంస్థ పరిరక్షణకు కార్మికుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రీజియన్ అధ్యక్షుడు కందుల నరసింహ, నాయకులు శ్యామ్ సుందర్, బోడ స్వామి, ఎగ్బాల్, శ్రీనివాస్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నల్లగొండ డిపో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా దండెంపల్లి సత్తయ్య, అధ్యక్షులుగా ఎండి. ఎగ్బాల్, ప్రధాన కార్యదర్శిగా బోడ స్వామి, కోశాధికారిగా ఎం.నర్సింహయ్య, ప్రచార కార్యదర్శిగా వెంకటేష్‌తో పాటు మరో పదకొండు మందితో నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.