Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంస్థలను అమ్మేస్తున్న బీజేపీని ఓడించాలి
- సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చౌటుప్పల్
రాజ్యాంగాన్ని కాలరాస్తూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తున్న బీజేపీని మునుగోడులో ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలకేంద్రంలో తెలంగాణ రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరపత్రాలను శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్యతో కలిసి సీతారాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతారాములు మాట్లాడుతూ దేశంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైందన్నారు. దేశ సంపదను పది మంది బడా పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం వెనుకబడిన కులాలను బిచ్చగాళ్లలా చూస్తుందని తెలిపారు. బస్వరాజు సారయ్య మాట్లాడుతూ రజకుల సంక్షేమానికి పాటుపడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలన్నారు. పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ మునుగోడులో ప్రతి వృత్తిదారుడు కారు గుర్తుకు ఓట్లు వేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కానుగు బాలరాజు, బాతరాజు దశరథ, గరిసె నర్సింహా, లింగస్వామి, డాకోజు లక్ష్మీనారాయణ, గోపి కృష్ణ, బాలరాజు పాల్గొన్నారు.