Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వేలమందికిపైగా ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం
- ఎండీ కలిదిండి గౌతమ్
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని నాగార్జునసిమెంట్స్ పరిశ్రమ సున్నపురాయి ఉత్పత్తిని పెంచేందుకు శుక్రవారం గుండ్లపల్లి మైనింగ్ ప్రాంతంలో ప్రజాభిప్రాయసేకరణ అదనపు కలెక్టర్ మోహన్రావు అధ్యక్షతన నిర్వహించారు.ఈప్రజాభిప్రాయ సేకరణలో54మంది తమఅభిప్రాయాలను వెల్లడించారు.ఒక్కరు మినహా మిగిలిన వారంతా విస్తరణకు అనుకూలంగా మాట్లాడారు.ప్రస్తుతం ఒక మిలియన్ టన్నులఉత్పత్తి సామర్ధ్యం నుండి మూడుమెట్రిక్ టన్నుల ఉత్పత్తిని పెంచుకునేందుకు సర్వేనెంబర్ 63,170లో 322.06 ఎకరాలలో రూ.17కోట్లతో సున్నపురాయి తీసుకునేందుకు ఈ అభిప్రాయ సేకరణ జరిపారు.రూ.1.46 కోట్లతో పర్యావరణానికి కేటాయించారు.మాట్లాడిన వక్తలు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,గ్రామాల అభివద్ధికి ప్రస్తుతం అందిస్తున్న సహకారంతో పాటు అదనంగా అందించాలని కోరారు.విద్యా, వైద్యంపై పరిశ్రమ అందిస్తున్న సహకారం చాలాబాగుందని వెల్లడించారు.
3వేల మందికి పైగా ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం
ఎండీ కలిదిండి గౌతమ్
తమ పరిశ్రమ స్థాపించిన 40 ఏండ్లలో ఇప్పటివరకు 3వేలమందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు కల్పిస్తున్నా మన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వెల్లడించిన అభిప్రాయాలను కమిటీతో చర్చించి పరిష్కారంఅయ్యే పనులు పరిష్కరిస్తామన్నారు.విద్యా,వైద్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాస్తు న్నామని, విద్యకు ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చుచేసి కార్పొరేట్ విద్యకు దీటుగా విద్యను అందిస్తున్నా మన్నారు.వైద్య విషయంలో ఏటా 35 వేల మందికి ఈ ప్రాంతంలోని వారికి వైద్యం అందిస్తున్నా మన్నారు.ఉద్యోగ,ఉపాధి అవకాశాలతో పాటు 9వందల మందికి చిన్న,చిన్న కాంట్రాక్టర్ల రూపంలో పనులు కల్పిస్తున్నామన్నారు.డిప్లమా,డిగ్రీ చేసిన వాళ్లకుశిక్షణ ఇస్తున్నా మన్నారు.విరివిగావైద్యశిబిరాలు నిర్వహిస్తామన్నారు.
ప్రజల అభిప్రాయాలను మినిట్స్ రూపంలో పంపిస్తాం
పర్యావరణం ఈఈ - సురేష్
నాగార్జునసిమెంట్స్ సున్నపురాయి విస్తరణకు ప్రజలనుండివచ్చిన అభిప్రాయాలను యథాతథంగా వీడియో రికార్డింగ్ చేయటం జరిగింది.ప్రత్యక్షంగా 54మంది మాట్లాడారు.45 మంది రాతపూర్వకంగా తమ కార్యాలయానికి అందించారని,ఈ సభలో 10మంది రాతపూర్వకంగా అందించారని తెలిపారు.ఈకార్యక్రమంలో ఆర్డీఓ వెంకరెడ్డి,డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి,పరిశ్రమ అధికారులు రాజా, ఎస్.చక్రధర్,జానకిరాంరెడ్డి, దస్తగిరిరెడ్డి,సీఐ రామలింగారెడ్డి,ఎంపీపీ మూడావత్ పార్వతీ కొండానాయక్, జెడ్పీటీసీ జగన్నాయక్,గుండ్లపల్లి సర్పంచ్ సుదర్శన్,గుండా బ్రహ్మారెడ్డి, మన్నెం శ్రీనివాసరెడ్డి,కాంగ్రెస్ మండలఅధ్యక్షుడు మంజీనాయక్,సర్పంచులు వెంకటరమణ, రామారావు, కష్ణ పాల్గొన్నారు.