Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
కల్లుగీత కార్మికసంఘం మూడో రాష్ట్ర మహాసభల్లో చేసిన తీర్మాణాలు పరిశీలించి పరిష్కారం చేయాలని కోరుతూ శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని, ప్రతి సొసైటీకి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, 560 జిఓ అమలుచేయాలని కోరారు. కల్లులోని పోషకాలను ఔషధ గుణాలను ప్రభుత్వమే ప్రచారం చేసి మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. గీతన్న బంధు ప్రకటించి, ప్రతి గీత కార్మికుని కుటుంబానికి పది లక్షల చొప్పు ఇవ్వాలని, ఉచితంగా ద్విచక్ర వాహనాలు అందజేయాలన్నారు. తాటి, ఈత, ఖర్జూర, జీలుగు హైబ్రీడ్ మొక్కలు ఉచితంగా ఇచ్చి నీటి సౌకర్యం కల్పించాలన్నారు. వత్తిలో ఎక్కడ ప్రమాదానికి గురై చనిపోయినా, శాశ్వత వికలాంగం పొందినా వారి కుటుంబాలకు పది లక్షలు, తాత్కాలిక వికలాంగులకు లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. షరతులు లేకుండా ఐదువేల పింఛన్ ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలన్నారు. సర్దార్ సర్వారు పాపన్న విగ్రహానికి ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని కోరారు. జనగాం జిల్లాకు పాపన్న జనగాం జిల్లాగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎంవి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రాగీరు కష్ణయ్య, నల్లగొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొండ వెంకన్న, చెవగాని సీతారాములు, గౌరవ సలహాదారులు మాటూరి బాలరాజుగౌడ్, నాయకులు గోవింద్, బూడిద గోపి, రమేశ్‌గౌడ్, వెంకన్న, అంజయ్య, అచ్చాలు, బత్తుల లక్ష్మయ్య, మద్దెల రాజయ్య, సుదర్శన్, గోపాల్, రాములు పాల్గొన్నారు.