Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్
నవతెలంగాణ-చివ్వెంల
వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ఉపాధిపనులకు సంబంధించిన ప్రణాళికను గ్రామసభల ద్వారా తయారు చేయాలని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ సూచించారు.శుక్రవారం మండలకేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో చివ్వెంల,మోతె మండ లాలకు చెందిన సర్పంచులు, పంచాయితీ కార్య దర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో పంచాయతీరాజ, గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ ఆదేశాల మేరకు సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రణాళికను గ్రామసభల ద్వారా తయారుచేయాలని సూచించారు.ఈ ప్రణాళిక తయారు చేయుటకు సంబంధించిన పూర్తి నియమనిబంధనలపై విస్తృతంగా శిక్షణ ఇచ్చారు. ఫీల్డ్అసిస్టెంట్లను గ్రామ పంచాయతీలు పూర్తిస్థాయిలో వినియోగించు కోవాలన్నారు.ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా గ్రామపంచాయతీ ఉద్యోగులేనని తెలిపారు.డీపీఓ యాదయ్య మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు ఉపాధిహామీచట్టంపై పూర్తి బాధ్యత ఉందని తెలిపారు.అడిషనల్ డీఆర్డీఓ పెంటయ్య మాట్లాడుతూ వచ్చే 2023 సంవత్సరం జూన్ మాసంలో అన్ని గ్రామ పంచాయతీలలో నాటాల్సిన హరితహారం మొక్కలను పెంచుటకు గాను ఏర్పాటు చేయాల్సిన నర్సరీలను బ్యాగులు నింపి విజయవంతంగా నిర్వహించే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు.చివ్వెంల ఎంపీపీ ధరావత్ కుమారిబాబు నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాల మేరకు సర్పంచుల నాయకత్వంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది చక్కగా పనిచేసే సీఎం కేసీఆర్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాలను తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధిహామీ చట్టంలోని పనులపై చాలా గ్రామాలలో ఆయాగ్రామస్తులకు సరైన అవగాహన లేదన్నారు.అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధి సిబ్బందిపై,పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో రెండు మండలాల ఎంపీడీఓలు లక్ష్మీ,వెంకటాచారి,ఎంపీఓలు గోపి, హరిసింగ్,ఏపీవోలు నాగయ్య,నగేష్,ఇరు మండలాలలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.