Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
ఒక నిబద్ధత గల ఉపాధ్యాయ ఉద్యమ సంస్థ టీఎస్‌యూటీఎఫ్ అని సంఘం జిల్లా అధ్యక్షులు సిరికొండ అనిల్‌కుమార్ అన్నారు.శుక్రవారం పట్టణంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.రవీంద్ర అధ్యక్షతన జరిగిన నేరేడుచర్ల,పాలకవీడు, గరిడేపల్లి మండలాల మహాసభలో ఆయన మాట్లాడారు.ఉపాధ్యాయుడి సామాజిక స్థితి పెంచడానికి జరిగిన ఉద్యమాల్లో యూటీఎఫ్ పాత్ర గణనీయ మైనదన్నారు.వేతన సవరణ సందర్భాల్లో న్యా యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చెందాల్సిన ఆర్థిక లాభాలను సాధించడంలో యూటీఎఫ్ ప్రముఖ పాత్ర పోషించిం దన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం పరిస్థితి అట్టడుగు స్థాయికి దిగజారిపోయిందన్నారు.ప్రభుత్వ విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందన్నారు.మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టి వచ్చినట్టు కనబడుతుందన్నారు.ఏడేండ్లుగా పదోన్నతులు లేకపోవడం వల్ల వేలాదిమంది ఉపాధ్యాయులు ప్రమోషన్ పొందకుండానే రిటైర్ అయ్యారన్నారు.ఉమ్మడి సర్వీస్ నిబంధనల అంశం,పండిట్, పీఈటీల పదోన్నతి అంశాలు కోర్టులో మూలుగుతున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్ సభ్యులు నల్లపు సాంబయ్య,నేరేడుచర్ల మండల అధ్యక్ష కార్యదర్శులు బి.సైదులునాయక్,బి.అక్కయ్య, గరిడేపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు వై.సైదిరెడ్డి, బి.నాగేశ్వర్రావు, పాలకవీడు అధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీనివాస్,సీనియర్ నాయకులు నాగండ్ల నర్సింహారావు, బి.బాలసైదిరెడ్డి, లింగం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.