Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కౌలు రైతులసంఘం ఆధ్వర్యంలో కోత మిషన్ రేట్లను నిర్ణయించామని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్నెం పాపిరెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిధిలోని రామలక్ష్మిపురం గ్రామంలో నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు.కోత మిషన్ రేట్లు టు వీలర్ టైరు బండి రూ.1800,ఫోర్‌వీల్ టైర్ బండి రూ.2200, చైన్ మిషన్ రూ.2500 గా నిర్వహించామన్నారు.ఈ రేట్లు అన్ని గ్రామాలలో అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించామన్నారు.ఈ రేట్లను బండ్ల ఓనర్లు కూడా ఆలోచించి రైతులకు , మిషను ఓనరులు అమలు చేసే విధంగా నిర్ణయించామన్నారు.రైతులు పండించిన ధాన్యం మిల్లర్ల వద్ద నికరబస్తా ప్రభుత్వం 75 కేజీలుగా ప్రభుత్వంనిర్ణయించామన్నారు.కానీ మిల్లర్లు 77 కేజీల నికర బస్తాగా ధాన్యం తీసుకుంటున్నారన్నారు.దీనిపై వెంటనే కలెక్టర్ స్థాయిలో మిల్లర్స్‌తో మాట్లాడి 75 కేజీలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్‌గాంధీ తెలంగాణలో కౌలురైతుల గురించి కౌలు రైతులకు కూడా రైతుబీమా,రైతుబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారని,వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం కౌలురైతులకు రైతుబీమా,రైతుబంధు అమలు చేయాలని సమావేశంలో చర్చించారు.ఈ సమావేశంలో కౌలురైతులు అన్నెం నర్సింహారెడ్డి,వెంకటరెడ్డి, గంగిరెడ్డి చిన్నకోటిరెడ్డి,భిక్షంరెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.