Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
మండల వ్యాప్తంగా అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలను వెంటనే ప్రారంభించాలని హామాలి కార్మిక సంఘం మండల కార్యదర్శి బూడిద బిక్షం డిమాండ్ చేశారు. మండలంలోని ఎన్నారం గ్రామంలో శుక్రవారం రైతులు, హమాలీల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆయన డిమాండ్ చేశారు. వడ్ల రాశులు పోసి నెల రోజులు గడస్తున్నా ఇప్పటికీ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. హమాలీలకు ఉపాది లేక కుటుంబాలు ఇబ్బందులూ పడుతున్నాయన్నారు. హమాలీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ గ్రామ శాఖ అధ్యక్షులు కంబాలపల్లి రాములు, ఉపాధ్యక్షులు చిట్టి మాల సుదర్శన్, కార్యదర్శి జాల వెంకన్న, ముసుగు పెద్ద మోహన్ రెడ్డి, నల్ల నర్సిరెడ్డి, అంబాల మల్లయ్య, అంబటి మారయ్య, కంబాలపల్లి సైదులు పాల్గొన్నారు.