Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
మునుగోడు ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పాతుకుపోయిన ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘనుడు కేసీఆర్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం దామర భీమనపల్లి, కమ్మ గూడెం గ్రామాలలో ప్రచారం సందర్భంగా మాట్లాడారు.మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగా ఉండేదని, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన చౌటుప్పల్‌లో పైలాన్ ప్రాజెక్టు మొదలు పెట్టి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించిన నేత కెసిఆర్ అని అన్నారు. మునుగోడు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే సాధ్యమని, నవంబర్ మూడున జరిగే మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా దామర భీమనపల్లి, కమ్మగూడ గ్రామాలలో ఫ్లోరిన్ వ్యాధి బారిన పడిన ప్రజలను కలిసి వారి బాగోగులు తెలుసుకోనీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా నీ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి చిలువేరు విష్ణు, మాజీ సర్పంచ్ అంతిరెడ్డి, వనమాల మహేష్, నడుముంటి శ్రీను, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.