Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నాంపల్లి మండలం పగిడిపల్లి గ్రామంలో శుక్రవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఎన్నికల ప్రచారంనిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటు విలువను అర్దం అయ్యే విధంగా డమ్మీ బ్యాలెట్ బాక్స్‌తో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తు మొదటి ఈవీఎం డబ్బాలో రెండో స్థానంలో ఉంటుందని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వివరించారు. గత ఎనిమిదేండ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిపిన టీఆర్ఎస్ పార్టీకి తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరికలు..
టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బండతిమ్మాపూర్ గ్రామం మాజీ సర్పంచ్ బుడిగపాక కృష్ణ, రేవల్లి యోహాను, ప్రవీణ్, గుండెబోయిన ఆంజనేయులు, బీజేపీ నాయకులు నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుండెబోయిన రాజమల్లు, సీపీఐ మాజీ మండల కార్యదర్శి కుంభం సత్తిరెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు.