Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మెన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి
నవతెలంగాణ-మర్రిగూడ
అమ్మా..టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మెన్ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో వ్యవసాయ కూలీలతో ప్రచారంలో భాగంగా మాట్లాడారు. గత బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచన చేయలేదని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే రైతులకు వ్యవసాయం పట్ల ఒక భరోసా అనేది వచ్చిందని, రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. రైతుబంధు, రైతు బీమా వంటి రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముందుకు కొనసాగాలంటే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కార్యదర్శి అయితగోని వెంకటయ్య, సర్పంచ్ నగేష్, పరిపూర్ణ చారి, కర్ణాకర్, రమేష్, ఈసార పు ప్రవీణ్, భాను, తదితరులు పాల్గొన్నారు.