Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట కోసి పడిగాపులు
- ప్రారంభం కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
- ధాన్యం ఆరబెడుతూ కుప్పల వద్ద జాగారం
- ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వని అధికారులు
వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు నిరీక్షిస్తున్నారు. ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు ఆరబోస్తున్నారు. స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే కుప్పలు పోశారు. చలికాలం కావడంతో రైతులు ధాన్యాల వద్ద మంటలు వేసుకొని పడిగాపులు కాస్తున్నారు. దీపావళి తర్వాత కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని ధాన్యం రాశులు పోసి ఎదురుచూస్తున్నారు.
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలంలో విస్తారంగా వర్షాలు కురవడంతో ఏ గ్రామంలోనైనా కుంటలు చెరువులు కాలువలు ఎక్కడ చూసినా నీరు అధికంగా ఉండి భూగర్భ జలాలు నీటిమట్టం కావడంతో వరి పంటలు అధికంగా సాగు చేశారు. మండలంలోని 11165 ఎకరాల వరి సాగు చేశారు.కానీ వర్షాలకు అక్కడా అక్కడ వరి పంట నెలకొరిగింది. నెలరోజుల నుండి వరి కోతలు ప్రారంభమై అధికారులు ఇప్పటివరకు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తే వారు అడ్డుకి పావు చేరుగా ధర అడుగుతున్నారు. క్వింటా మద్దతు ధర రూ.2060 ఉండగా దళారులు మాత్రం రూ.1500 -1600 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఇంత తక్కువకు ధాన్యం అమ్ముతే ఏమి మిగిలాయని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలుగా పోసి రైతులు నిరీక్షిస్తున్నారు. వేరే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై... మన జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి.
రోడ్ల పైన కుప్పలు తీరని రైతుల తిప్పలు..
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలం లేకపోవడంతో రోడ్ల పైన ప్రధాన రహదారుల పైన సీసీ రోడ్ల పైన ఆరబోస్తూ నాన్న తిప్పలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులపై ధాన్యం ఎండబోయడంతో వాహనాలు అధికంగా ప్రయాణిస్తుండగా ఏమైనా ప్రమాదం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళలో అయితే ధాన్యం దగ్గర కాపలా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలే రెండు మూడు రోజుల నుండి చలి తీవ్రత పెరగడంతో రోడ్లపైనే పడుకుంటున్నారు..
నెల రోజులు అయింది..
కరిని రామనర్సయ వంచగుడం.
నెలరోజుల కింద వరి పంట కోసి ధాన్యాన్ని ఆరబెడుతూ ఉన్నాను. పది పదిహేను రోజుల ముందు నిత్యం రోజు వర్షాలు కురవడంతో భయంతో వరి పంట కోశాను. ధాన్యాన్ని అమ్మాలంటే ఇంకా ఎన్ని రోజులు అవుతుందో. రోడ్లపైనే ధాన్యాన్ని ఆరబోస్తూ నానా తిప్పలు పడుతున్నాను. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల కష్టాలు తీర్చాలి.