Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
నవంబర్ 8,9 తేదీల్లో మహబూబాద్లో నిర్వహించే భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర 3వ మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అద్యక్షులు గొరిగె సోములు కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించే సంఘం రాష్ట్ర మహాసభల్లో కార్మికుల సమస్యలు చర్చించి పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష,కార్యదర్శులు వంగాల మారయ్య, జుంపాల మహేష్, నాయకులు గొరిగె ఆదిమల్లయ్య, రాసాల రమేష్, వెంకట్ రెడ్డి, భూడిద ముత్యాలు ఎల్లయ్య, దర్శయ్య, వంగాల లక్ష్మణ్, గుంజి కొండల్ తదితరులు పాల్గొన్నారు.