Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ .ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
భరించి బానిసలయ్యే దానికంటే తెగించి తానీషలవ్వడం నేర్చుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి మండల కేంద్రంలో నిర్వహించిన బహుజనుల ఆత్మగౌరవ సభలో రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సమాజంలో 80 శాతం ఉన్న బహుజనులం ఇంకా ఎంతకాలం బానిసలుగా ఉందామని ప్రశ్నించారు. తెగించి పోరాడితే తానీషాల మవుతామన్నారు. మునుగోడులో ఇప్పటివరకు జరిగిన 12 పర్యాయాల శాసనసభ ఎన్నికల్లో బహుజనులను బానిసలుగా చూస్తున్నారన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలనానరు. ఉప ఎన్నికల్లో వారు ఇచ్చిన వీరు ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం బీఎస్పీకి వేసుకోవాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి శంకరాచారిని గెలిపించాలని సూచించారు. ఈ బహిరంగ సభలో బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి,బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్,మాజీ అధ్యక్షులు సిద్ధార్థ పులే,చంద్రశేఖర్ ముదిరాజ్,కత్తుల పద్మ,సాంబశివ గౌడ్, దాసరి ఉష,ఎలిజబెత్ రాణి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.