Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసోసియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-సూర్యాపేట
ఫొటోగ్రాఫర్స్ నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోని అభివృద్ధి చెందాలని ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపర్తి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.రాష్ట్ర అసోసియేషన్ సహకారంతో ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్ చెరువులో ఏర్పాటుచేసిన ఫొటో వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతిప్రజ్వలన గావించి ప్రారంభించారు.అనంతరం మాట్లాడుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ వర్క్‌షాప్ నిర్వహి స్తున్నట్టు తెలిపారు. వర్క్‌షాప్ ఎంతో మందికి ఉపయోగపడుతుందని తెలిపారు.వర్క్ షాప్‌కు ఒక్కొక్కరు రూ.5 వేలు చెలించాల్సి ఉన్నా ఫొటోగ్రాఫర్లందరూ అభివద్ధి చెందాలని గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ పటాన్‌చెర్వు అసోసియేషన్ ఉచితంగా ఏర్పాటు చేసిందన్నారు.వర్క్‌షాప్‌కు సహకరించిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి, ఉచిత సెమినార్ అందించిన వెంకి, సహకరించిన సోని ఇండియా, మాతా డిజిప్రెస్, టీజేసీ రాష్ట్ర అసోసియేషన్ తరపున ఆయన ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి మునగాల శైలందర్, గ్రేటర్ గౌరవఅధ్యక్షులు కాశీరత్నం, ఫొటోటెక్ ఛీఫ్ అభిమన్యు, ఓంప్రకాశ్ , జూలూరిమధు, కృష్ణాయాదవ్, రాజేష్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.