Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు బచ్చల కూర చిన్నరాములు నేత్రాలను, పార్థివదేహాన్ని త్యాగం చేసిన గొప్పవ్యక్తి అన్ని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు అన్నారు.ఆదివారం నేలమర్రి గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు బచ్చలకూర చిన్న రాములు సంతాపసభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నేలమర్రి గ్రామం అగ్రభాగాన నిలిచిందని తెలిపారు.ఆ గ్రామంలో జన్మించిన చిన్నరాములు కడదాకా కమ్యూనిస్టుగా నిలిచారని కొనియాడారు. కష్టజీవుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసి వారి సమస్యల పరిష్కారం కోసం కషి చేశారని చెప్పారు. తన మరణానంతరం నేత్రాలను, పార్థివదేహాన్ని త్యాగం చేసి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.ఈసంతాప సభలో నాస్తికసంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు పెనమంత సుబ్బారావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, దేవరవెంకటరెడ్డి, కోట గోపి, మునగాల మాజీ సింగిల్ విండో చైర్మెన్ దేశిరెడ్డి స్టాలిన్రెడ్డి, జె.నర్సింహారావు, నాస్తిక సంఘం రాష్ట్ర నాయకులు బచ్చలకూర జార్జి, బీబీషా,సుందర్రావు, కుటుంబ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, గోవర్ధన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు బి.రాంబాబు, కాంపాటి శ్రీను, మాజీ ఎంపీటీసీ జూలకంటి విజయలక్ష్మి, టి.సతీష్, వై.వీరాంజనేయులు పాల్గొన్నారు.