Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తూ ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువచేసే సేవలను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందజేస్తుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు విట్టా దుర్గయ్య పేర్కొన్నారు. వాసవీ క్లబ్స్ డిస్ట్రిక్ట్ వి104ఏ రీజియన్ చైర్మెన్ ఉప్పల వెంకటరమణ అధ్యక్షతన ఐశ్వర్య సాయి కళ్యాణ మండపంలో అరుణ కిరణాలతో రమణీయ వనంలో సాయి సంతోష వాసవీ కుసుమాలు రీజియన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవీ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2800 క్లబ్స్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యున్నత సేవా సంస్థగా నిలిచిందన్నారు. పేద విద్యార్థులకు నోట్ బుక్స్, స్కాలర్ షిప్స్, ప్రభుత్వ పాఠశాలాల్లో మౌళిక వసతుల కల్పన, ఆపదలో ఉన్న వారికి చేయూత అందించేలా విభిన్న సేవలందిస్తూ అందరి మన్ననలందుకుంటున్నదని చెప్పారు. రాబోయే రోజులలో వాసవీ క్లబ్స్ సేవలను మరింత విస్తతం చేస్తూ సమాజ సేవలో ముందుండాలని క్లబ్స్ అధ్యక్షులను ఆయన కోరారు. సమాజ సేవలో అగ్రగామి సంస్థగా నిలిచిన వాసవీ క్లబ్స్‌లో ఆర్యవైశ్యులు సభ్యులుగా ఉంటూ అన్ని వర్గాలకు సేవలందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రీకన్ అబ్సెవర్ పి.వి.లక్ష్మినారాయణ, ఇంటర్ నేషనల్ డైరెక్టర్లు యమ కవిత దయాకర్, రుంద్రంగి రవి శేషి, ఇంటర్ నేషనల్ మాజీ కార్యదర్శి గజ్జల రామకష్ణ, డిస్ట్రిక్ట్ కేబినెట్ కార్యదర్శి వీరేల్లి సతీష్,, కేబినెట్ కోశాధికారి తేలుకుంట్ల వీరయ్య, ఇంటర్ నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్లు బ్రహ్మ దేవర పద్మావతి, ఇంటర్ నేషనల్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ లు బొల్లము శోభా కష్ణమూర్తి, గుండా శ్రీధర్,తాళ్ళపల్లి రాము, పల్లవి, మురారిశెట్టి ఉమాక్రిష్ణ మూర్తి పాల్గోన్నారు.
జాతీయ అవార్డుకు సర్పంచ్ శ్రీనునాయక్ ఎంపిక
నవతెలంగాణ-దేవరకొండ
ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డు 2022 సంవత్సరంకుగాను దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా సర్పంచ్ నేనావత్ శ్రీనునాయక్ ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ ప్రకటించింది. సెలక్షన్ కమిటీ చైర్మెన్, బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని ఆదివారం హైదరాబాదులో శ్రీనునాయక్ అందజేశారు. నవంబర్ 13వ తేదీన ఢిల్లీలో జరిగే ఆలిండియా బహుజన రైటర్స్ మూడవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఉత్తమ సర్పంచ్ నేషనల్ అవార్డును అందజేయనున్నారు. అవార్డు గ్రహీత సర్పంచ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ సహకారంతో గ్రామాన్ని 100శాతం అభివద్ధి చేశామన్నారు. అవార్డు ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో బిఎస్ఏ, జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకష్ణ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎం. గౌతమ్, రాష్ట్ర కోఆర్డినేటర్ హనుమాన్ల విష్ణు, అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న తదితరులున్నారు.