Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్షలాదిగా తరలివచ్చిన మునుగోడు ప్రజానీకం
నవతెలంగాణ- చండూరు
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు నాలుమూలల నుండి లక్షలాదిగా మునుగోడు ప్రజానీకం తరలివచ్చింది. దీంతో గులాబీ మయమైన చండూరు, బంగారు గడ్డ రోడ్లపై బారులు తీశారు.టీిఆర్ఎస్ జెండా కమ్యూనిస్టుల జెండాతో హోరెత్తించారు. నిండిన సభా ప్రాంగణంలో ఇసికేస్తే రాలనంత జనం హాజరు అయ్యారు. బహిరంగ సభ విజయవంతమయ్యింది. బారులు తీరిన జనం,ఆనందోత్సాహాల మధ్య ఉభయ కమ్యూనిస్టులు , టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. ఆధ్యంతం జన జాతరలా సభ సాగింది. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే, మునుగోడును గుండెల్లో పెట్టి చూసుకుంటా అని సీఎం కేసీఆర్ సభలో ప్రసంగించారు.పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సీపీఐ, సీపీఐ(ఎం) నాయకులు కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాకారులు
సీఎం కేసీఆర్ బహిరంగ సభలో కళాకారుల ఆటపాటలు, నృత్యాలు , మహిళల కోలాటాలు ఆకట్టుకున్నాయి. కార్యకర్తల ఉత్సాహంతో దద్దరిల్లింది. చప్పట్లతో మార్మోగింది. ఐదు కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో కార్యకర్తలు సభకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ మూడు గంటలకు రావాల్సిఉండగా, నాలుగు గంటలకు రావడంతో కార్యకర్తలు వేచి చూస్తూ ఎండను లెక్కచేయకుండా ఉండిపోయారు. సీఎం కేసీఆర్ రాకతో బహిరంగ సభ ఆనందోత్సవాల మధ్య సాఫీగా సాగింది.