Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ-మర్రిగూడ
శివన్నగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన భూనిర్వాసితుల సమస్యను పరిష్కరించేందుకు తనేే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం శివన్నగూడ, కుదపక్షపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాల భూ నిర్వాసితుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఒక మతోన్మాద పార్టీ అని, 8 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే బీజేపీని తెలంగాణలో లేకుండా చేయాలన్నారు. మునుగోడు ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కోరుకునే ఎన్నికలు కావని, రాజగోపాల్‌రెడ్డి 18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని, మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమీషా, మోడీల దగ్గర తాకట్టు పెట్టాడని తెలిపారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయలేని రాజగోపాల్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే గెలిచి చేసేది ఏంటిదని నిలదీశారు. మర్రిగూడ మండలం సస్యశ్యామలం కావాలంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, మునుగోడు ప్రజలంతా ఏకపక్షంగా టీఆర్ఎస్ వైపు నడవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు చెరుకు లింగంగౌడ్, పందిరి యాదగిరి, అయితగోని యాదగిరి, బోయపల్లి శ్రీను, బండి నరసింహ, యాదయ్య, సుంకరి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.